News January 23, 2025

GWL: ఉద్యోగులు సంతోషంగా లేరు: రామచంద్రారెడ్డి

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సంతోషంగా లేరని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గద్వాల జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది కాలం గడిచినా హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు.

Similar News

News November 24, 2025

కల్వకుర్తి: భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

image

గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎక్వాయిపల్లిలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.

News November 24, 2025

అనకాపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి

image

లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 13న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ లోక్ దాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరు పార్టీల వారు రాజీకి వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. దీనివలన సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు.

News November 24, 2025

బేబీ కార్న్‌ను ఈ సమయంలో కోస్తే ఎక్కువ లాభం

image

బేబికార్న్ కండెలను 45-50 రోజులప్పుడు పీచు 2-3 సెం.మీ. ఉన్నప్పుడు అంటే పీచు వచ్చిన 1-3 రోజులకు కోయాలి. కోత ఆలస్యం చేస్తే కండెలు గట్టిపడి, విత్తనాలు వచ్చి బేబీ కార్న్‌గా ఉపయోగించేందుకు పనికిరావు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగుంటుంది. యాసంగిలో రోజు విడిచి రోజు పంటకోత చేపట్టాలి. కోసిన కండెల పీచు తీసేసి, సైజువారీగా ప్యాకింగ్ చేసి 10° సెంటీగ్రేడ్ వద్ద 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు.