News March 6, 2025

GWL: ఒకవైపు తండ్రి మృతి.. మరోవైపు పరీక్ష

image

అయ్యో.. కాలం ఆ ఇంటర్ విద్యార్థికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి వెళ్లిన ఘటన గద్వాల జిల్లా అల్లంపూర్ మండలంలోని లింగన్వాయిలో జరిగింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్రలో గురుకులలో ఇంటర్ పరీక్ష రాసి అంత్యక్రియలో పాల్గొనడం అందరిని కంటతడి పెట్టించింది.

Similar News

News January 7, 2026

నల్గొండ మున్సిపాలిటీది ఘనచరిత్ర

image

నల్గొండ మున్సిపాలిటీకి ఘనచరిత్రే ఉన్నది. నల్గొండను 1951లో 12 వార్డులతో గ్రేడ్ 3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం.. పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్ 2గా.. 2005లో 36 వార్డులతో గ్రేడ్ 1గా అప్ గ్రేడ్ చేశారు. 2018లో గ్రేడ్ 1గా ఉన్న మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీలో 2.5 లక్షల మేర జనాభా ఉన్నది.

News January 7, 2026

‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

image

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

News January 7, 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పాలమూరు వాసుల మృతి

image

ఉజ్జయిని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నచింతకుంట మండలం పర్దిపూర్‌కు చెందిన కావలి నరసింహులు(28), కురువ శివకుమార్(24) దుర్మరణం చెందారు. దైవదర్శనం ముగించుకుని వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన డ్రైవర్‌ కూడా మృతి చెందారు. గాయపడిన వారు నేడు గ్రామానికి చేరుకోనుండగా, పర్దిపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.