News February 12, 2025

GWL: ఒక్కసారిగా కుప్పకూలి వ్యక్తి మృతి

image

ఒక్కసారిగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాలలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. చెనుగోనిపల్లికి చెందిన దౌలత్(44) ఓ వైన్స్‌లో మద్యం తీసుకుని అక్కడే తాగాడు. తాగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు లేపేందుకు ట్రై చేయగా.. లేవలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అతడు చనిపోయినట్లు నిర్ధారించి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటే కారణమని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News December 7, 2025

HNK: రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా?

image

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో క్యూఆర్ కోడ్ ద్వారా పెట్టుబడి పేరుతో పంపిన డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఈ నెల 3న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు పెద్దమొత్తంలో ఉండటంతో నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.

News December 7, 2025

మునగాకు కషాయంతో బోలెడు ప్రయోజనాలు!

image

మునగాకు కషాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా కషాయం చేసుకోవచ్చు. రోజూ పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి’ అని చెబుతున్నారు.

News December 7, 2025

కరీంనగర్: పల్లెపోరులో స్థాయికి మించిన వాగ్దానాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థాయికి మించిన హామీ పత్రాలను పంచుతున్నారు. స్థానిక పన్నులు, కేంద్ర నిధులకు పరిమితమైన పంచాయతీకి భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇవి ఎలా నెరవేరుతాయోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యతపై అనుమానాలు ఉన్నా, గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.