News February 12, 2025

GWL: ఒక్కసారిగా కుప్పకూలి వ్యక్తి మృతి

image

ఒక్కసారిగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాలలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. చెనుగోనిపల్లికి చెందిన దౌలత్(44) ఓ వైన్స్‌లో మద్యం తీసుకుని అక్కడే తాగాడు. తాగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు లేపేందుకు ట్రై చేయగా.. లేవలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అతడు చనిపోయినట్లు నిర్ధారించి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటే కారణమని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News November 19, 2025

టీమ్ ఇండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా ఘోరంగా <<18303459>>ఓడిన <<>>సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మిస్టరీ స్పిన్నర్‌ను మేనేజ్‌మెంట్ రంగంలోకి దించింది. ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ కౌశిక్ మైతీతో బౌలింగ్ చేయించింది. 2 చేతులతో బౌలింగ్ చేయగలగడం కౌశిక్ ప్రత్యేకత. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి చేతితో, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎడమ చేతితో బౌలింగ్ వేయగలరు.

News November 19, 2025

‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

image

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్‌ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ‌ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్‌లకు ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ వల్ల మెసేజ్‌ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్‌కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

News November 19, 2025

ADB: ఆపదమిత్ర శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

image

విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన ‘ఆపదమిత్ర’ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ, భారత్ స్కౌట్స్ గైడ్స్ చీఫ్ కమీషనర్ రాజేశ్వర్ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు గల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ హైదరాబాద్‌లో వారంపాటు ఉంటుందని వివరించారు.