News January 28, 2025
GWL: కాలేజీకి వెళ్లమంటే.. ఆత్మహత్య చేసుకుంది

గద్వాల(M) అనంతపురానికి చెందిన ఓ యువతిని తల్లి కళాశాలకు వెళ్లమని మందలించినందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పావని (16) ఇంటర్ చదువుతోంది. సోమవారం యువతిని తల్లి మందలించి కూలికి వెళ్లింది. దీంతో పావని ఇంట్లో ఉరేసుకుంది. పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లి యువతిని చూసి గుండెలవిసేలా విలపించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 15, 2025
జగిత్యాల: ‘విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి’

జగిత్యాల జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి డా. బోనగిరి నరేష్ పాల్గొన్నారు. మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఫోన్లకు దూరంగా ఉంటూ, మంచిని మాత్రమే గ్రహించాలని ఆయన సూచించారు.
News October 15, 2025
HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్.. 80 వేల కేసుల నమోదు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకుండా సీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జనవరి 1 నుంచి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో మరో 2,345 కేసులు నమోదైనట్లు తెలిపారు. No Call Is More Important Than a Life అంటూ ప్రచారం చేస్తున్నారు.
News October 15, 2025
‘కౌలు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదు’

కౌలు రైతులకు రుణాలు ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. 8వేల మంది కౌలు రైతులకు రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, కేవలం 2,326 మంది కౌలు రైతులకు రూ.8.80 కోట్ల రుణం ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులు పెట్టుబడులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని బ్యాంక్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.