News February 12, 2026

GWL: కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్స్ నిషేధం..!

image

గద్వాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ సెంటర్‌లోకి మొబైల్స్‌ను నిషేధించినట్లు శ్రీనివాసరావు గురువారం పేర్కొన్నారు. అగ్గిపెట్టెలు, లైటర్స్, ఇంకు బాటిల్స్, పేలుడు పదార్థాలు, భద్రతకు ముప్పు కలిగించే వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం నిషేధించామన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే ఏజెంట్లు, అభ్యర్థులు విషయాన్ని గ్రహించి కౌంటింగ్‌కు సహకరించాలన్నారు.

Similar News

News March 7, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

News March 7, 2026

అమలాపురం: పోలీసుల ‘ఆపరేషన్ వజ్రప్రహార్’

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా శనివారం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. SP రాహుల్ మీనా ఆదేశాలతో అమలాపురం, రావులపాలెం, పామర్రు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, నేరస్థుల ఆటకట్టించడానికి ఏకకాలంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజా భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా కీలక ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించి సోదాలు జరిపారు.

News March 7, 2026

నిప్పుల కుంపటిలా నాగర్ కర్నూల్

image

జిల్లాలో వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అత్యధికంగా 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి, తిమ్మాజీపేటలో 38.4°C, ఊర్కొండలో 38.2°C గా రికార్డయ్యాయి. భానుడి భగభగలకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.