News March 12, 2025

GWL: గద్వాల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరిగేనా?

image

గద్వాల జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించాలని నడిగడ్డ ప్రజలు అంటున్నారు. ప్రధానంగా RDS చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తుమ్మిళ్ల లిఫ్ట్ పరిధిలో 3 రిజర్వాయర్లు నిర్మించాలని, నెట్టెంపాడు ప్రాజెక్టులో మిగిలిన పనులు, గట్టు ఎత్తిపోతల పూర్తిచేయాలని, కర్నూల్ రాయచూరు రోడ్డు కు నిధులు కేటాయించాలని, అయిజను సెగ్మెంట్ గా గుర్తించాలని కోరుతున్నారు.

Similar News

News March 25, 2025

భార్యపై ‘రిప్లింగ్’ కో-ఫౌండర్ సంచలన ఆరోపణలు

image

అనూప్ అనే వ్యక్తితో తన భార్య దివ్య అక్రమ సంబంధం పెట్టుకుందని రిప్లింగ్ కంపెనీ కో-ఫౌండర్, TNకు చెందిన ప్రసన్న శంకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వారి చాట్ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశారు. అందులో ఆమె ‘కండోమ్‌’ గురించి ప్రస్తావించిందని ప్రసన్న తెలిపారు. మరోవైపు భర్త తనను వేధిస్తున్నాడంటూ దివ్య ఫిర్యాదు చేయడంతో ప్రసన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరికి పదేళ్ల కిందట పెళ్లి కాగా ఓ కొడుకు ఉన్నాడు.

News March 25, 2025

ఏలూరు జిల్లాకు అలర్ట్..!

image

ఏలూరు జిల్లాలో వాతావరణం మారుతోంది. రానున్న రెండు రోజుల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ వేలేరుపాడులో 40.1, పోలవరంలో 39.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. 26న పోలవరంలో 39.4, వేలేరుపాడులో 40 డిగ్రీల ఎండ కాస్తుందని తెలిపింది.

News March 25, 2025

అశుతోశ్‌ను అలా ఎలా వదిలేశారో!

image

అశుతోశ్ గత ఏడాది పంజాబ్‌కు ఫినిషర్‌గా గేమ్స్ గెలిపించాడు. అతడి IPL స్ట్రైక్ రేట్ 167.26 కాగా సగటు 27. లీగ్‌లో భారత ఫినిషర్ దొరకడమే అరుదు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వేలంలో కేవలం ₹3.80 కోట్లకే దక్కించుకుంటుంటే ఇతర జట్లు చోద్యం చూశాయి. నిన్న 7 రన్స్‌కే 3వికెట్లు కోల్పోయిన DCని అశుతోశ్ ఒంటిచేత్తో ఒడ్డుకు చేర్చాడు. ముందు సీజన్లో ఆల్రెడీ తనను తాను నిరూపించుకున్న అతడిపై జట్లు ఎందుకు ఆసక్తి చూపలేదో మరి!

error: Content is protected !!