News December 20, 2024
GWL: గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: జిల్లా ఎస్పీ
గట్టు మండల పోలీస్ స్టేషన్ను గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, కేసులు, పెండింగ్ కేసులు, సీడీ ఫైళ్లు తదితరాలను సమీక్షించారు. గ్రామ ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, స్టేషన్లో ఉన్న కార్యకలాపాలపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారికి మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
Similar News
News February 5, 2025
MBNR: బావిలో మునిగి బాలుడు మృతి
వనపర్తి జిల్లా అమరచింతం మండలం చంద్రప్ప తాండ శివారు బావిలో ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చిన్నచింత కుంట మద్దూరుకి చెందిన గొల్ల నాగరాజు కుమారుడు కురుమూర్తి (15) చంద్రప్ప తాండ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా బాలుడు అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతూ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
News February 5, 2025
బాలానగర్: ఉరేసుకుని యువకుడి సూసైడ్
ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలనగర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ (23) హైదరాబాదులో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందో కారణం తెలియదు కానీ.. తల్లి కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
ఫంక్షన్కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.