News March 21, 2025

GWL: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

image

గద్వాల పట్టణంలోని MALD ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. జాబ్ మేళాలో ఉద్యోగం సంపాదించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు.

Similar News

News November 5, 2025

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడులకు కుట్ర?

image

జమ్మూకశ్మీర్‌లో దాడులకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ SSG, ISI సాయంతో ఆయా సంస్థల టెర్రరిస్టులు దేశంలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నాయి. టెర్రరిస్టు షంషేర్ ఆధ్వర్యంలోని టీమ్ డ్రోన్ల ద్వారా LoC గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసిందని చెప్పాయి. క్రాస్ బార్డర్ అటాక్స్ చేసేందుకు పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించాయి.

News November 5, 2025

మేడారం: ‘ఛాలెంజ్‌గా పనులు పూర్తి చేయండి’

image

మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ఆవరణలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ఆర్ అండ్ బి ఈఈ మోహన్ నాయక్ పరిశీలించారు. చేపట్టిన పనులను ఛాలెంజ్‌గా తీసుకుని సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఈ నెల 10లోపు పిల్లర్స్, గ్రానైట్ పనులను తప్పక పూర్తి చేయాలని ఈఈ ఆదేశించారు.

News November 5, 2025

SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

image

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్‌పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్‌కు వివరించారు.