News March 5, 2025

GWL: నీట్ యూజీ-2025 కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

image

జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో మే 4న నిర్వహించనున్న నీట్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గద్వాల్ పరిధిలోని ఎస్ఆర్. విద్యానికేతన్ (గద్వాల్), సరస్వతి స్కూల్ (ఎర్రవల్లి) పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. గదుల వసతులు సీటింగ్ ఏర్పాట్లు సీసీటీవీ పర్యవేక్షణ వెంటిలేషన్ తదిత అంశాలను పరిశీలించారు.

Similar News

News February 23, 2026

భువనగిరి: గ్రామపంచాయతీలకు నిధులు విడుదల

image

జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు జమ అయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు అందాయి. ఈ నిధుల్లో 60 శాతాన్ని తాగునీరు, పారిశుద్ధ్య పనులు, మిగిలిన 40 శాతాన్ని పెండింగ్ బిల్లులు, ఇతర అభివృద్ధి పనులకు మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

News February 23, 2026

భువనగిరి: మున్సిపల్ బడ్జెట్ కసరత్తు షురూ

image

జిల్లాలోని మున్సిపాలిటీల్లో వార్షిక బడ్జెట్ రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టేలా ఛైర్మన్లతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆస్తి పన్ను, నీటి తీరువా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందిస్తారు. గతేడాది కంటే 10-20% పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయనుండగా, ఇందులో 10% నిధులను తప్పనిసరిగా ‘గ్రీన్ బడ్జెట్’ కోసం కేటాయించనున్నారు.

News February 23, 2026

మధురవాడ: డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

image

భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక- మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.