News January 31, 2025
GWL: ‘నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి’

వచ్చే నెలా 10న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బియం సంతోష్ వైద్య అధికారులకు ఆదేశించారు. గురువారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. నులి పురుగుల నిర్మూలన కోసం పిల్లలందరికీ అల్బెండజోల్ 400 ఎంజీ మాత్రలను వేయించాలని సూచించారు.
Similar News
News October 25, 2025
డ్రగ్స్ కేసు.. సినీ నటులకు ఈడీ సమన్లు

డ్రగ్స్ కొనుగోలు కేసులో సినీ నటులు <<16798985>>శ్రీరామ్<<>>(శ్రీకాంత్), కృష్ణకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూన్లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో వీరి హస్తం ఉందని విచారణలో తేలడంతో అరెస్టు చేయగా జుడీషియల్ రిమాండ్ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు EDకి చేరడంతో ఈ నెల 28న శ్రీకాంత్, 29న నటుడు కృష్ణ దర్యాప్తునకు రావాలని కోరింది.
News October 25, 2025
MBNR: బీ.ఫార్మసీ.. స్పాట్ అడ్మిషన్స్

పాలమూరు వర్శిటీలోని బీ.ఫార్మసీ కోర్సులో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రమేష్ బాబు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 26లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని, ఈనెల 28న పబ్లికేషన్ ఫారం ఫార్మసీ కళాశాల కార్యాలయంలో ఇచ్చి కన్ఫామ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www.palamuruunivetsity.ac.in వెబ్ సైట్ను సందర్శించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 25, 2025
బస్సు దగ్ధం.. రావులపాలెం వాసి మృతి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు దగ్ధం ఘటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు చిక్కుకున్నారు. రావులపాలెంకు చెందిన క్రేను ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి రెండు రోజులు క్రితం పనుల కోసం HYD వెళ్లాడు. వేరే పని ఉండడంతో బెంగళూరు వెళ్లడానికి బస్సు ఎక్కి, ప్రమాదంలో మరణించాడు. కాగా అనపర్తికి చెందిన రామారెడ్డి, కాకినాడకు చెందిన సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.


