News February 23, 2025
GWL: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఉమ్మడి ఇటికాల మండలంలోని గురుకుల పాఠశాలల్లో ఆదివారం జరిగిన 2025 పీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆదివారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరు, కేంద్రాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
అల్లూరి జిల్లాలో సెల్టవర్ కోసం గ్రామస్థుల వినతి

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ, సన్యాసమ్మపాలెం గ్రామాలకు ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు సెల్టవర్ ఏర్పాటుకు సంతకాల సేకరణ చేపట్టారు. దాదాపు 2,000 జనాభాలో 1,500 మంది ఫోన్ వాడుతున్న నేపథ్యంలో ఈ సేవలు అత్యవసరమని తెలిపారు. సేకరించిన దరఖాస్తును సోమవారం పాడేరు ఐటీడీఏ పీవో పూజకు సమర్పించనున్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.
News November 24, 2025
314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
News November 24, 2025
ధర్మేంద్ర ఆస్తి ఎంతో తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన ఆస్తి విలువ రూ.335-450 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. సినిమాలు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా ఇంత మొత్తం ఆర్జించినట్లు తెలిపింది. ముంబై-పుణె మధ్యలో ఉండే లోనావాలాలో 100 ఎకరాల ఫాంహౌజ్ ఉందని పేర్కొంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కువగా ఈ ఫౌంహౌజ్లో చేసే వ్యవసాయం వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం.


