News February 16, 2025

GWL: పాముకాటుతో వ్యక్తి మృతి

image

పాముకాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల మండలం బీరోలు గ్రామంలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్ వివరాలు.. గ్రామానికి చెందిన బీచుపల్లి(47) నిన్న కృష్ణనదిలో చేపల వేటకు వెళ్లాడు. మార్గం మధ్యలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుమారుడు నరేందర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 2, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం

News March 2, 2026

కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి: ఎమ్మెల్యే

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ MP DK అరుణ ఎమ్మెల్యే దీక్షను విరమింపజేశారు.

News March 2, 2026

ప్రధాని పదవిపై తొలిసారి రాహుల్ సానుకూల సంకేతాలు!

image

TG: ప్రధానమంత్రి పదవి చేపట్టడంపై తొలిసారి రాహుల్ గాంధీ సానుకూల సంకేతాలు ఇచ్చారు. వికారాబాద్‌లో జరిగిన DCC అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ‘ఈ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే’ అని సీఎం రేవంత్ కోరారు. అందుకు స్పందించిన రాహుల్ ‘మోదీపై యుద్ధానికి సిద్ధం’ అని తల ఊపుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి అలంకరణ కాదని, ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని రేవంత్ తెలిపారు.