News February 5, 2025

GWL: పొదుపు (పొదుపు నిధి) పథకం పునః ప్రారంభం: కలెక్టర్

image

తెలంగాణ చేనేత అభయ హస్త పథకంలో భాగంగా తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి) పథకంను పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వారు కనీసం 50% చేనేత వృత్తి నుంచి ఆదాయం పొందే కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడు ప్రతినెల 15 లోపల తను సంపాదించిన వేతనం నుంచి 8% RD-1కు జమ చేసుకోవాలన్నారు.

Similar News

News November 19, 2025

మద్యం మత్తులో డ్రైవింగ్.. మహిళ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు

image

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడుపుతూ దుంగ రమణమ్మ అనే మహిళ మరణానికి కారణమైన కేసులో నిందితునికి కఠిన శిక్ష పడింది. ​నేరం రుజువు కావడంతో గౌరవ VIII ADJ న్యాయస్థానం నిందితుడైన పొట్నూరు త్రినాథ్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.

News November 19, 2025

రాజమండ్రి బస్టాండ్‌ వెనుక దాగిన ‘కోటి’ రహస్యం!

image

రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌.. ప్రయాణికులకే కాదు, చరిత్రకూ గుర్తు. ‘కోటి తీర్థ క్షేత్రం’ నుంచి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి గౌతమీ నదిలో కోటి పుణ్య నదులు అంతర్వాహినులుగా ప్రవహిస్తాయని నమ్మకం. అయితే 1928లో ఇక్కడ రైల్వే లైన్ ఉండేదని, యుద్ధంలో ఉక్కు కొరతతో దానిని తొలగించారనే విషయం చాలామందికి తెలియదు. బస్టాండ్‌ వెనుక తరతరాల చరిత్ర, కనుమరుగైన రైల్వే క్రాసింగ్ కథ దాగి ఉంది.

News November 19, 2025

నేడు కాజీపేట నుంచి దర్భాంగా స్పెషల్ ట్రైన్

image

కాజీపేట మీదుగా దర్భాంగ స్పెషల్ రైలు బుధవారం నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దర్భాంగ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు(07999) కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్‌నగర్, బల్లార్ష, గోండియా, రాయపూర్, బిలాస్‌పూర్, రాంచి సహా పలు స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఈ రైలును నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.