News February 27, 2026

GWL: పోలీస్ సేవలు మెరుగుపరచాలి: ఎస్పీ

image

ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లాలోని నిర్వహించిన క్రైమ్ రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ‘విలేజ్ హిస్టరీ షీట్స్’ అప్‌డేట్ చేయాలని, రాత్రి పూట గస్తీ (నైట్ బీట్) పెంచి చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

ఏలూరులో ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

image

ఏలూరు స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాలలో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు గవ్వా శ్రీనివాసరావు, కె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు తదితర ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

News April 16, 2026

KNR: కో-ఆప్షన్ సభ్యుల పదవులకు భారీగా దరఖాస్తులు

image

కరీంనగర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఈనెల 10 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 46 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఐదు కోఆప్షన్ సభ్యులకు భారీగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తులు రావడంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

News April 16, 2026

వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

image

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.