News February 27, 2026
GWL: పోలీస్ సేవలు మెరుగుపరచాలి: ఎస్పీ

ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లాలోని నిర్వహించిన క్రైమ్ రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఎస్ పరిధిలో ‘విలేజ్ హిస్టరీ షీట్స్’ అప్‌డేట్ చేయాలని, రాత్రి పూట గస్తీ (నైట్ బీట్) పెంచి చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Similar News
News April 15, 2026
బీట్‌రూట్‌తో హెల్తీ హెయిర్

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్‌రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.
News April 15, 2026
యుద్ధం వేళ డిజిటల్ బంగారంపై పెరిగిన నమ్మకం!

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. స్టాక్ మార్కెట్ల ఊగిసలాటల మధ్య రిస్క్ లేని పెట్టుబడి కోసం గోల్డ్ ETFలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఏకంగా ₹31,561 కోట్లు ఈ ఫండ్లలోకి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 6రెట్లు పెరగడం గమనిస్తే.. ఇన్వెస్టర్లు భౌతిక బంగారం కంటే డిజిటల్ పసిడి వైపే అట్రాక్ట్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది.
News April 15, 2026
అంబటికి పోలీసుల నోటీసులు

కడప జిల్లా వేంపల్లి పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 1న సింగారెడ్డి రామ మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నోటీసులు అందిన వారం రోజుల్లోగా వేంపల్లి స్టేషనుకు హాజరై దర్యాప్తుకు సహకరించాలని అధికారులు ఆదేశించారు.


