News April 12, 2025
GWL: పోషకాహార లోపనివారణకు కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాస్థాయి కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 8 నుంచి 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు పుట్టినరోజు వరకు 1000 రోజుల కాలంలో పోషకాహారంపై దృష్టి సారించాలని అన్నారు.
Similar News
News November 18, 2025
ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇంట్లో అవమానాలు.. iBomma రవి కథలో షాకింగ్ ట్విస్ట్

పోలీసుల విచారణలో iBomma రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్కు మకాం మార్చాడు.