News February 19, 2025
GWL: పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చాలి: కలెక్టర్

పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది పని చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 37 వార్డుల్లో రెవెన్యూ, పారిశుద్ధ్యం, మెప్మా, అకౌంట్స్, ఇంజనీరింగ్ వంటి విభాగాల వారిగా సమీక్ష నిర్వహించి, ప్రతి అంశంపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు ఆస్తి, దుకాణాల పన్నులు వసూలు చేయాలన్నారు.
Similar News
News November 22, 2025
PHCలలో అరకొర సేవలు.. ప్రజలకు రేబిస్ టీకా కష్టాలు

ఖమ్మం జిల్లాలోని 22 PHCలు,3 బస్తీ దవాఖానాల్లో వైద్యులు, మందుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రేబిస్ వ్యాక్సిన్ వంటి అత్యవసర మందులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గర్భిణులకు టెక్నీషియన్, వసతులు లేక జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారు. సేవలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
‘రాంగ్రూట్’ అత్యంత ప్రమాదకరం: సీపీ సునీల్ దత్

రాంగ్రూట్లో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. కొద్దిపాటి దూరం కోసం కూడా రాంగ్రూట్ను ఆశ్రయించవద్దన్నారు. ‘మీరు చేసే పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది’ అని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో ప్రయాణించి, క్షేమంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.


