News March 14, 2025
GWL: ‘ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి’

హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని, నూతనంగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.
News March 17, 2026
MNCL: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టగా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. జంట మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.
News March 17, 2026
WGL: స్తంభించిన రియల్ ఎస్టేట్..!

ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ కొంతకాలంగా మందగమనంలో సాగుతోంది. రెండేళ్లుగా క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో అటు వ్యాపారులు, ఇటు రిజిస్ట్రేషన్ శాఖ ఆందోళన చెందుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, 2024లో 1,05,834 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 2025లో 1,03,784, 2026లో ఇప్పటివరకు 19,146 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. గతంలో రోజుకు సగటున 170 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ప్రస్తుతం 40 కూడా దాటడం లేదు.


