News March 12, 2025
GWL: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 13, 2025
MBNR: ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు జిల్లా వ్యాప్తంగా మ్యాథ్స్ ,బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించారు. నేడు మొత్తంగా 10,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా కేవలం 10,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 209 మంది జనరల్,51 మంది ఒకేషనల్ విద్యార్థులు మొత్తంగా 260మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
News March 12, 2025
MBNR: PHD ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి.!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సులకు సంబంధించిన PHD ప్రవేశ ఫలితాలను మంగళవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ విడుదల చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈనెల 17 నుంచి 20 వరకు ఆయా కోర్సులలో ప్రవేశాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇది రాసిన ఉమ్మడి పాలమూరు వాసులు రిజల్ట్స్ http://www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చన్నారు.
News March 12, 2025
గద్వాల కోట.. ఈ విషయం మీకు తెలుసా.?

తెలంగాణలోని అతిపెద్ద సంస్థానం జోగులాంబ గద్వాల కోట. తూర్పున అలంపూర్, పడమర రాయచూరు హద్దులుగా 360 గ్రామాలు కలిగి ఉన్నది. కర్నూల్ నవాబుల నుంచి కప్పం పొందిన సంస్థానంగా ఖ్యాతిగాంచింది. గద్వాల సంస్థానం మూల పురుషుడు బుడ్డారెడ్డి. గద్వాల సంస్థానాన్ని పాలించిన రాజులలో పెద్ద సోమభూపాలుడిని జానపద కథకులు ముద్దుగా నల్ల సోమనాద్రిగా పిలుచుకునే వారు. ఇతడే గద్వాల కోట నిర్మాణ కర్తగా పేరు పోందారు.