News February 2, 2025
GWL: బాలికల సంరక్షణకు సమన్వయంతో పని చేయాలి: అడిషనల్ కలెక్టర్

బాలికల సంరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. బేటి బచావో, బేటి పడావో కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడిఓసి మందిరంలో సమావేశం నిర్వహించారు. బాలికలను రక్షిద్దాం, వారిని చదివిద్దాం అన్న నినాదంతో గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News October 20, 2025
దీపావళి వెనుక పురాణగాథలు తెలుసా?

నరకాసురుడిని శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ వధించిన మరుసటి రోజే దీపావళి జరుపుకుంటారని ప్రసిద్ధి. లంకాధిపతి రావణుడిని వధించిన శ్రీరాముడు ఇదే రోజున సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్నారని, వారికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలా నిర్వహించారని రామాయణ గాథ చెబుతోంది. ఈ వెలుగుల పండుగ దీపావళి మీ జీవితంలోని చీకట్లను తొలగించి సరికొత్త కాంతులను నింపాలని ఆకాంక్షిస్తున్నాం.
HAPPY DIWALI
News October 20, 2025
దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్‌పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్‌తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.
News October 20, 2025
జూబ్లీహిల్స్లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.