News February 17, 2025
GWL: బీజేపీ ఫ్లెక్సీలు చింపివేత.!

బీజేపీ శ్రేణుల ఎదుగుదలను ఓర్వలేక ఫ్లెక్సీలను చింపి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆ పార్టీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి పేర్కొన్నారు. తిక్క వీరేశ్వర స్వామి ఉత్సవాలకు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం అర్ధరాత్రి దుండగులు చింపివేశారని ఆవేదన చెందారు. ఇలాంటి చర్యలు అరికట్టేందుకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు కోరినా పట్టించుకోవడం లేదన్నారు.
Similar News
News April 17, 2026
ఖమ్మం: భానుడి భగభగ.. మూగజీవాల విలవిల

ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 42 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనంతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు అడవుల్లో నీరు దొరక్క మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం, మట్టి తవ్వకాలు పెరగడంతో దుప్పులు, అడవి పందులు, కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
News April 17, 2026
ఉమ్మడి వరంగల్‌లో నియోజకవర్గాల పెంపుపై చర్చ!

ఉమ్మడి జిల్లాలో జనాభా ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనున్నట్లు చర్చ సాగుతోంది. HNKలో 2 నుంచి 5, WGLలో 3 నుంచి 4, MHBDలో 2 నుంచి 4, BHPLలో 1 నుంచి 2 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. జనగామలో సరిహద్దుల మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. MLG యధాతథంగా కొనసాగనుంది. మొత్తం కొత్తగా 7 అసెంబ్లీ స్థానాలు పెరగడంతో పాటు మరో లోక్‌సభ స్థానం కూడా ఓరుగల్లుకు వచ్చే అవకాశముంది.
News April 17, 2026
శ్రీ సత్యసాయి: నలుగురి మృతికి కారణమైన వారిపై పెట్టిన కేసు ఇదే..!

కదిరి(M) కుమ్మరవాండ్ల పల్లిలో బుధవారం ఓ ఇంట్లో జరిగిన విస్ఫోటం ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన వెంకన్న అద్దెకు ఉంటున్న ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ అక్రమంగా నిల్వ ఉంచగా.. గ్యాస్ లీకై అవి పేలినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నలుగురి మృతికి కారణమైన వెంకన్న, అతని కొడుకుపై IPC 304 (BNS 105) కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు.


