News February 4, 2025

GWL: మరో రెండు రోజులే మిగిలింది..!

image

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫిబ్రవరి 1న చివరి తేది ఉండగా.. ప్రభుత్వం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనట్లయితే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ నాగర్‌కర్నూల్ జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 28, 2025

అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

image

1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
1924: నటి సూర్యకాంతం జననం (ఫొటోలో)
1959: సినీ నటుడు గోవిందరాజు సుబ్బారావు మరణం
☛ అంతర్జాతీయ యానిమేషన్ డే

News October 28, 2025

ముచ్చటగా మూడు షాపులు దక్కించుకున్న మహిళ

image

మహబూబాబాద్ జిల్లాలోని ఓ మహిళను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ముచ్చటగా మూడు వైన్ షాపులను దక్కించుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్.శ్రీవాణికి డోర్నకల్ పట్టణంలో గౌడ కేటగిరీలో రెండు షాపులు రాగా.. ముల్కలపల్లిలో సైతం ఓ షాప్ వచ్చింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. మీకు తెలిసిన వారికి లక్కీ డ్రాలో షాప్‌లు వస్తే కామెంట్లో తెలపండి.

News October 28, 2025

ఖమ్మం: కార్తీకమాసం.. అరుణాచలంకు ప్రత్యేక బస్సు

image

కార్తీకమాసం సందర్భంగా ఖమ్మం కొత్తబస్టాండ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం సరీరాం తెలిపారు. నవంబర్ 3న రాత్రి 7గంటలకు బస్సు బయలుదేరి 4వ తేదీ కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5000, పిల్లలకు రూ.2530గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965లను సంప్రదించవచ్చని కోరారు.