News February 13, 2026

GWL: మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ హవా..!

image

గద్వాల జిల్లాలో అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల మున్సిపాలిటీలు ఉండగా మొత్తం 77 వార్డులు ఉన్నాయి. ఈనెల 11న ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. శుక్రవారం అధికారులు ఫలితాలు వెల్లడించారు. బీజేపీ 7 వార్డులు, కాంగ్రెస్ 29 వార్డులు, బీఆర్ఎస్ 30 వార్డులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 వార్డులు ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గెలుపొందారు. ఒక స్థానం ఆధిక్యంతో బీఆర్ఎస్ ముందు వరసలో నిలిచింది.

Similar News

News March 9, 2026

OFFICIAL: ఇరాన్ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు <<19299249>>మొజ్తాబా<<>> ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 88 మందితో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ బాడీ ఆయన్ను ఎన్నుకుంది. ఇరానియన్లు ఐక్యతను కాపాడుకోవాలని, మొజ్తాబా ఖమేనీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. నిర్ణయాత్మక ఓటు ద్వారా ఆయన ఎన్నికైనట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా వయసు 56 ఏళ్లు.

News March 9, 2026

యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు!

image

యూట్యూబ్‌లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్‌ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్‌తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్‌లు అవసరం లేకుండానే యూట్యూబ్‌లోనే వీడియోలు, మెసేజ్‌లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.

News March 9, 2026

పోచమ్మమైదాన్ జంక్షన్‌లో ఉద్రిక్తత.. లాఠీచార్జ్

image

వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్రపతి జెండాను ఓ వర్గానికి చెందిన యువకుడు తొలగించడంతో వివాదం చెలరేగింది. దీంతో మరో వర్గం అక్కడే మళ్లీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.