News March 27, 2025
GWL: ‘రంగారెడ్డికి నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లు’

పాలమూరు నుంచి రంగారెడ్డికి సాగునీరు తరలించి ఇక్కడి రైతులకు కన్నీళ్లు మిగిల్చారని MLC చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో గురువారం మాట్లాడుతూ.. కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డను సస్య శ్యామలం చేసేందుకు ఇక్కడి ప్రాజెక్టులు ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలన్నారు. రెండు నదుల మధ్య ఉండి సాగునీటికి ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు.
Similar News
News January 10, 2026
NTR: సంక్రాంతి నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ ఇవే

సంక్రాంతి రద్దీ మేరకు విజయవాడ(BZA)- హైదరాబాద్(HYD) మధ్య ఛైర్ కార్, జనరల్ బోగీలతో కూడిన స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ఓ ప్రకటన విడుదల చేసింది. 11, 12, 13, 18, 19న ఉదయం 6.10కి HYDలో ఈ రైళ్లు BZAకి బయలుదేరతాయని, 10, 11, 12, 17, 19న మధ్యాహ్నం 2.40కి BZAలో ఈ రైళ్లు HYDకి ప్రయాణిస్తాయని SCR పేర్కొంది. చైర్ కార్ బోగీలలో రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించింది.
News January 10, 2026
కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు

కొత్తూరు మండల కేంద్రంలో ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. కొత్తూరు నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ఈ ఇబ్బందులు తప్పలేదు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇలా కిక్కిరిసి గమ్యస్థానాలకెళ్లారు. ఫ్రీ బస్సు, పండగ రద్దీ కూడా దీనికి తోడైంది. అధికారులు స్పందించి తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News January 10, 2026
విశాఖ: 12 నుంచి జిల్లా స్థాయి పోటీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలు పాండురంగపురం వద్ద సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. గాలిపటాలు ఎగురు వేయుట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, తాడు లాగుట, కర్ర సాము పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


