News March 27, 2025

GWL: ‘రంగారెడ్డికి నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లు’

image

పాలమూరు నుంచి రంగారెడ్డికి సాగునీరు తరలించి ఇక్కడి రైతులకు కన్నీళ్లు మిగిల్చారని MLC చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో గురువారం మాట్లాడుతూ.. కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న నడిగడ్డను సస్య శ్యామలం చేసేందుకు ఇక్కడి ప్రాజెక్టులు ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలన్నారు. రెండు నదుల మధ్య ఉండి సాగునీటికి ఏపీ ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు.

Similar News

News April 20, 2025

ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.

News April 20, 2025

సంగారెడ్డి జిల్లాలో 218 కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

image

జిల్లాలో 95,687 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందులో దొడ్డు ధాన్యం 88,033 ఎకరాల్లో, సన్న ధాన్యం 7,654 ఎకరాల్లో సాగు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 218 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.

News April 20, 2025

వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.

error: Content is protected !!