News April 5, 2025
GWL: రైలు నుంచి పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు రైలులో నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ఇటిక్యాలలో జరిగింది. స్థానికుల వివరాలు.. పూడురు-ఇటిక్యాల రైల్వేస్టేషన్ మధ్యలో ఓ 45ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి రైలులో నుంచి కిందపడి మృతి చెందారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు మృతదేహాన్ని గద్వాల మార్చురీకి తరలించారు.
Similar News
News January 8, 2026
పసుపు పంట కోత – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

పసుపు తవ్వడానికి 2 రోజుల ముందే మొక్క ఆకులు, కాండాలను భూమట్టానికి కోయాలి. తర్వాత తేలికపాటి నీటి తడిని ఇచ్చి 2 రోజుల తర్వాత నుంచి పసుపు తవ్వకం ప్రారంభించాలి. తవ్వగా ఇంకా దుంపలు భూమిలో మిగిలిపోతే నాగలితో దున్ని ఏరాలి. పంటను తీసేటప్పుడు కొమ్ములకు దెబ్బ తగలకుండా చూసుకోవాలి. పసుపు దుంపలను ఏరాక మట్టిని తొలగించాలి. తర్వాత తల్లి, పిల్ల దుంపలు వేరుచేసి, తెగుళ్లు ఆశించిన దుంపలను పక్కకు తీసేయాలి.
News January 8, 2026
ED రైడ్స్.. ప్రతీక్ ఇంటికి CM మమత

IPAC కోఫౌండర్ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి TMCకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ను ED స్వాధీనం చేసుకుందని పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. ఇవాళ ఉదయం కోల్కతాలోని ప్రతీక్ ఇంటిపై ED <<18796717>>దాడులు<<>> చేసింది. దీంతో మమత ఆయన ఇంటికి వెళ్లిన సందర్భంలో ఈ కామెంట్లు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల వివరాలు ఉన్న ఫైల్స్ను ఈడీ అధికారులు తీసుకెళ్లారని మండిపడ్డారు.
News January 8, 2026
సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. HYDలో ఎక్కడినుంచి అంటే?

సంక్రాంతి పండుగ సందర్భంగా రేపటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు ఎప్పటిలాగే JBS, MGBSకు పోటెత్తకుండా ప్రధాన కూడళ్ల నుంచి నడపాలని నిర్ణయించింది. సిటీలో ఎంజీబీఎస్, జేబీఎస్, గచ్చిబౌలి, ఉప్పల్, బోయిన్పల్లి, ఆరాంఘర్, KPHB, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు.


