News March 13, 2025

GWL: విద్యార్థుల భవిష్యత్తుకు సెమినార్లు కీలకం: కలెక్టర్

image

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమినార్లు అత్యంత కీలకమని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని MALD ప్రభుత్వ కళాశాలలో “వృక్ష జీవితం, మానవ సంక్షేమంపై జీవ విజ్ఞాన దృక్పథాలు” అన్న అంశంపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొన్నారు. విద్యార్థులు పుస్తకాల్లో నేర్చుకునే విషయాలు నిజజీవితంలో ప్రయోగించి సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నారు. సెమినార్ల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు.

Similar News

News November 13, 2025

కాపర్ టీ వాడుతున్నారా?

image

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్‌ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.

News November 13, 2025

శ్రీరాంపూర్: 17న 100 మస్టర్లు లేని ఉద్యోగులకు కౌన్సిలింగ్

image

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెల వరకు 100 మస్టర్లు లేని ఉద్యోగులు ఈనెల 17న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని మేనేజర్ తిరుపతి సూచించారు. ఏ, బీ రిలే ఉద్యోగులకు ఉ.9 నుంచి 12 గంటల వరకు, సి, డి రిలే ఉద్యోగులకు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు గని కార్యాలయం, క్యాంటీన్‌లో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

News November 13, 2025

అదానీ కోసమే భూటాన్‌కు మోదీ: ప్రియాంక్ ఖర్గే

image

తన ఫ్రెండ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకే భూటన్‌లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? అదానీ డీల్ కోసం’ అని రాసుకొచ్చారు. అదానీ పవర్‌కు రూ.6000 కోట్ల హైడ్రో ప్రాజెక్ట్ డీల్‌పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్‌లో ఫొటో ట్యాగ్ చేశారు.