News February 4, 2025
GWL: విద్యుత్ షాక్తో ఒకరి మృతి

నాగర్ కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండపల్లి ఎల్లయ్య (60) విద్యుత్ బల్బు పెడుతుండగా అకస్మాత్తుగా షాక్ తగిలి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 20, 2025
ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్కు ప్రధాన కారణాలివే: ICMR స్టడీ

భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ 3లో ఉంది. తాజాగా ICMR చేసిన స్టడీలో లేట్ మ్యారేజ్, 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ, 50 దాటాక మెనోపాజ్ వల్ల ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్లు తేలింది. పొట్ట దగ్గర ఫ్యాట్, ఫ్యామిలీ హిస్టరీ, నిద్రలేమి, స్ట్రెస్ వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 40 ఏళ్ల నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని స్టడీ సూచించింది.
News December 20, 2025
ఈనెల 23న నల్గొండలో జాబ్ మేళా

జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న (మంగళవారం) జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాను నల్గొండలోని ఐటీఐ క్యాంపస్లో ఉదయం జరుగుతుందని, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి 10th, డిగ్రీ అర్హత గలవారు విచ్చేయాలని కోరారు.
News December 20, 2025
జూన్ కల్లా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం

AP: జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ కల్లా APని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ రావాలని, ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయొద్దని సూచించారు. అనకాపల్లి(D) తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10L గృహాలు, పట్టణాల్లో 5L ఇళ్లలో కంపోస్టు తయారీ తమ లక్ష్యమన్నారు.


