News March 21, 2025
GWL: సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు:DAO

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎస్టీ మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు రూ. 56.88 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అవకాశాన్ని అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 4, 2025
సంక్రాంతి బరిలో నెగ్గేదెవరో?

ఈసారి సంక్రాంతి బరిలోకి 7 సినిమాలు దిగనున్నాయి. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ లిస్ట్లో ఉన్నాయి. అటు విజయ్ ‘జననాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ బరిలో ఉన్నాయి. పోటీలో గెలిచే ‘పందెం కోడి’ ఏదని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News December 4, 2025
సంక్రాంతి శోభలా మెగా పీటీఎం నిర్వహించాలి: అనకాపల్లి కలెక్టర్

మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్ను ఈనెల 5న సంక్రాంతి శోభలా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులందరూ సమావేశంలో పాల్గొనే విధంగా చూడాలని ఆమె సూచించారు. ఈ మేరకు విద్యాసంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేయాలన్నారు. విద్యార్థుల ప్రతిభ, వారిలో ఉన్న సామర్ధ్యాలను ప్రదర్శించాలన్నారు.
News December 4, 2025
పెద్దపల్లి: పోస్ట్ బాక్సులు.. గుర్తున్నాయా..?

ఒకప్పుడు లేఖలతో పోస్ట్ బాక్సులు కళకళలాడేవి. ఆత్మీయుల శుభాకాంక్షలు, మనసులోని మాటలతో పలకరించేవి. అలాంటి మధుర జ్ఞాపకాలకు నెలవైన పోస్ట్ డబ్బాలు నేడు కనుమరుగయ్యాయి. ఫోన్లు, సోషల్ మీడియా రాకతో ఆ తపాలా పెట్టెలు ఆదరణ కోల్పోతున్నాయి. నేడు కేవలం ఖాళీ పెట్టెలు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. PDPL(D) ధర్మారంలో తీసిన చిత్రమిది. ఇక అప్పటి మధుర జ్ఞాపకాలను మోసిన పోస్ట్ బాక్సులతో మీకున్న అనుబంధాన్ని COMMENT చేయండి.


