News March 21, 2025
GWL: సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు:DAO

కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ ఉప పథకం కింద సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు గద్వాల జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు చిన్న, సన్నకారు మహిళా రైతులు, ఎస్టీ మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు రూ. 56.88 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అవకాశాన్ని అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News April 24, 2025
జగిత్యాల: రేపు పోషణ మాసం ముగింపు ఉత్సవాలు

జగిత్యాల జిల్లాలో పోషణ మాస ముగింపు ఉత్సవాలను శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నరేశ్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఉ.11గం.లకు పోషణ మాసం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొననున్నారని, కావున మహిళలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
News April 24, 2025
ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ కీలక ప్రకటన

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ పరిధిలో కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ కీలక ప్రకటన చేశారు. ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఇందులో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ టీమ్స్ పాల్గొన్నాయని వెల్లడించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోల సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
News April 24, 2025
ఇది మీ స్థాయి.. ఇక్కడ కూడా కాపీనేనా?

ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌పై భారత్ నిన్న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ సైతం అదే దారిలో నడిచింది. వీసాల రద్దు, హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అట్టారీ వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య కార్యకలాపాల రద్దు ఇలా ప్రతి దాంట్లోనూ మనల్నే కాపీ కొట్టింది. ఇక 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.