News April 3, 2025

GWL: ‘సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం’

image

అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిర, వెంకట్రామమ్మ పేర్కొన్నారు. గురువారం గద్వాలలో జరిగిన అంగన్వాడీ వర్కర్ల సమావేశంలో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. కోశాధికారి లక్ష్మీ రంగమ్మ, ఉపాధ్యక్షురాలు గిరిజ, సభ్యులుగా చిట్టెమ్మ, కృష్ణవేణిని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వారిని అభినందించారు.

Similar News

News November 23, 2025

వివిధ పండ్ల తోటలు – పిందె రాలడానికి కారణాలు

image

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.

News November 23, 2025

మావోయిస్టు కీలక నేతల్లో సిక్కోలు వాసులు

image

మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ కీలక నేతల్లో సిక్కోలు వాసులు ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావు మృతిచెందగా, తాజాగా మరేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో జిల్లాలోని బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు కీలకనేత మెట్టూరు జోగారావు(టెక్ శంకర్) మరణించారు. అదే ప్రాంతానికి చెందిన చెల్లూరు నారాయణరావు(సూరన్న) అజ్ఞాతంలో ఉన్నారు.

News November 23, 2025

ఆన్‌లైన్‌లో సర్వపిండి, సకినాలు!

image

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.