News February 20, 2025

GWL: ‘స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట భద్రత ఉండాలి’

image

ఎన్నికల సామాగ్రి ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లో పటిష్ట భద్రత ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్‌ను బుధవారం పరిశీలించారు. అక్కడి రికార్డులను పరిశీలించి, సీసీ కెమెరాలు పని చేసే విధానం గురించి ఆరా తీశారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు సాధారణ తనిఖీలు నిర్వహించామని చెప్పారు. తహశీల్దార్ మల్లికార్జున్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 5, 2026

సంగారెడ్డి: ‘వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయండి’

image

సంగారెడ్డి జిల్లా వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్, కాంటింజెంట్ వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై పనిభారం విపరీతంగా పెరుగుతోందని, దీంతో రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News January 5, 2026

ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలి: ఆదర్శ్ సురభి

image

వనపర్తి జిల్లాలో బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో కాకుండా బయట ఇతర పనుల్లో ఉంటే ఆపరేషన్ స్మైల్ ద్వారా యాజమానులపై కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ, పోలీస్, లేబర్, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

News January 5, 2026

MHBD: కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 72 దరఖాస్తులు

image

గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. ఈరోజు మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.