News November 28, 2025

GWL: అనైతిక చర్యలకు ఆరేళ్లు నిషేధం: కలెక్టర్‌

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని గద్వాల కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదని సూచించారు.

Similar News

News December 3, 2025

పల్నాడులో పొలిటికల్ ఫైట్.. కాసు వర్సెస్ జూలకంటి.!

image

పల్నాడులో కాసు, జూలకంటి కుటుంబాల మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. రెండు కుటుంబాల మధ్య మొదట నుంచి రాజకీయ వైరం ఉంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి వారసుడిగా మహేశ్ రెడ్డి కొనసాగుతున్నారు. పల్నాటి పులిగా పేరు పొందిన జూలకంటి నాగిరెడ్డి వారసుడిగా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు. వైసీపీ, టీడీపీ మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం పల్నాడుకు ఏ కుటుంబం ఏమి చేసింది అనే చర్చకు దారి తీసింది.

News December 3, 2025

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>డ్రెడ్జింగ్ <<>>కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, రెసిడెంట్ మేనేజర్, Asst కంపెనీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నేటి నుంచి ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. dredge-india.com

News December 3, 2025

పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

image

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్​తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.