News November 10, 2024
GWL: అపోహలు వీడి పూర్తి సమాచారం ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి
కులగణనపై ప్రజలు అపోహలు విడనాడి కుటుంబ సమగ్ర సమాచారం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్‌తో మాట్లాడారు. కులగణనలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్త వహించే విధంగా చూడాలన్నారు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులను సర్వేలో భాగస్వాములు చేయాలన్నారు.
Similar News
News November 13, 2024
మహిళలకు రక్షణ భరోసా కేంద్రాలు: డీకే అరుణ
భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. షీటీం ఆధ్వర్యంలో మంగళవారం MBNRలోని మోనప్పగుట్టలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో MP పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల, బాలల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, MLA శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర, SP జానకి పాల్గొన్నారు.
News November 13, 2024
MBNR: గ్రూప్-3 పరీక్ష సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్-3 పరీక్ష జిల్లాలో సజావుగా నిర్వహించాలని MBNR అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. MBNR, దేవరకద్రలలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.
News November 12, 2024
వెల్దండ: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వెల్దండ మండలం మహాత్మాగాంధీ తండా సమీపంలో వారం రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. రాజు అనే వ్యక్తిని అతని భార్య హిమబిందు, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు.