News January 24, 2025
GWL: అబాండెడ్ వాహనాలకు ఈనెల 30న వేలం పాట

పోలీస్ తనిఖీల్లో పట్టుబడి ఎవరు గుర్తించలేని అబాండెడ్ వాహనాలకు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు పీజేపీ క్యాంపులోని సాయుధ దళ పోలీస్ కార్యాలయం ఆవరణలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు రూ.200 ఫీజు చెల్లించి ఆధార్ కార్డుతో వేలంపాటలో పాల్గొనాలని సూచించారు. వేలంపాటకు ఒకరోజు ముందు వాహనాలు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
Similar News
News November 11, 2025
అన్ని దేశాల టెకీలకు స్వర్గధామం మన HYD

చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతాల జాబితాలో HYD నిలిచింది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజినీర్లు సైతం HYDకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టీకి అశ్విన్‌రాజ పవన్ తెలిపారు. ఇతర దేశాలతో పోల్చితే HYDలో తక్కువ ఖర్చుతో, ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.

HYD: గృహ ప్రవేశం.. ఓనర్‌ను ఘోరంగా కొట్టిన హిజ్రాలు

గృహ ప్రవేశం రోజు యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చీర్యాలలోని బాలాజీఎన్‌క్లేవ్‌లో జరిగింది. సదానందం నూతన ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా మరో 15 మందిని వెంట పెట్టుకొచ్చి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో సదానందం తలకు గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.