News January 23, 2025

GWL: అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామసభలు: SP

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోందని గద్వాల SP శ్రీనివాసరావు పేర్కొన్నారు. గద్వాల మండలం వీరాపురం గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేస్తారని చెప్పారు. జాబితాలో పేర్లు లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామసభలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News March 1, 2026

కర్నూలు- కాచిగూడ రైలు.. 8 రోజులు రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కార్యకలాపాల కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కర్నూలు సిటీ (17435), కాచిగూడ-రాయచూరు (67787) రైళ్లతో పాటు, కర్నూలు సిటీ-కాచిగూడ (17436) రైలును మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు.. 8 రోజులు రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.

News March 1, 2026

రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

image

చలి, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 1, 2026

కలలో చీపురు కనిపిస్తే..

image

కలలు సాధారణం. అయితే అందులో చాలా వస్తువులు కనిపిస్తాయి. వాటిపై అనేక అపోహలుంటాయి. అందులో చీపురు ఒకటి. అది కనిపిస్తే అశుభమని భయపడతారు చాలామంది. కానీ అది పొరపాటని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ‘చీపురు లక్ష్మీదేవి స్వరూపం. కలలో చీపురు కనిపిస్తే దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇది జీవితంలో రాబోయే సానుకూల మార్పులకు సూచిక. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.