News September 3, 2025

GWL: ఆగస్టులో షీ టీం పర్ఫామెన్స్ ఇలా!

image

గద్వాల జిల్లా షీ టీమ్ బృందం ఆగస్టులో యువతులకు, విద్యార్థినులకు, పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేకంగా 10-అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 73-హాట్ స్పాట్ల తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. 3 పిటిషన్లు స్వీకరించి, 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 12 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, 12 ఈ-పెట్టి కేసులు నమోదు చేసి 13 కౌన్సిలింగ్ నిర్వహించిందని తెలిపారు.

Similar News

News September 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 4, 2025

ఇక ఈ కార్లన్నింటిపై 40 శాతం GST

image

మిడ్ రేంజ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. 1500cc కెపాసిటీ, 4000mm పొడవు, 170mm గ్రౌండ్ క్లియరెన్స్.. వీటిల్లో ఏది మించినా 40% ట్యాక్స్ పడనుంది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SUV), మల్టీ యుటిలిటీ వెహికల్స్(MUV), మల్టీ పర్పస్ వెహికల్స్(MPV) క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికల్స్(XUV).. ఏ మోడలైనా పరిమితి దాటితే లగ్జరీ శ్లాబ్ పరిధిలోకి వస్తాయి. అటు ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం 5% శ్లాబులోనే కొనసాగనున్నాయి.

News September 4, 2025

HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

image

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.