News January 27, 2025
GWL: ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాడుతాం..!

గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని పరిసర గ్రామాల రైతులు నర్సింహులు, సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం 5వ రోజు దీక్షా శిబిరం వద్ద ఆయా గ్రామాల మహిళలతో రిలే దీక్షలు చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కంపెనీ నిర్మాణం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కంపెనీ నిర్మాణం వల్ల తుంగభద్రా నది పరివాహక ప్రాంతం కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
Similar News
News July 7, 2025
‘నేడు స్కూళ్లకు సెలవు’ అని మీకు మెసేజ్ వచ్చిందా?

TG: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు యాజమాన్యాలు ఇవాళ సెలవును ప్రకటించాయి. ‘మొహర్రం సెలవు’ అంటూ పేరెంట్స్ ఫోన్లకు మెసేజులు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొహర్రం పబ్లిక్ హాలిడే ఆదివారం రోజే ఉంది. అటు పలు స్కూళ్లు మాత్రం ఇవాళ సెలవు లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. దీంతో కొందరిలో గందరగోళం నెలకొంది. మరి మీకు సెలవు మెసేజ్ వచ్చిందా? కామెంట్.
News July 7, 2025
ములుగు జిల్లాలో టెన్షన్.. టెన్షన్..!

జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చల్వాయికి చెందిన చుక్క రమేశ్ ఆత్మహత్య వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు ఇస్తున్నాయంటూ రమేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కేసు నమోదుతో భయాందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపడతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. కాగా నేడు మంత్రుల పర్యటన ఉంది.
News July 7, 2025
ఖమ్మం జిల్లాలో విషాదం.. వ్యవసాయ కూలీ మృతి

కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన మారుతి పెద్ద గోపయ్య(56) వ్యవసాయ కూలీ. ఓ రైతు పొలానికి నారు మడిలో యూరియా చల్లేందుకు వెళ్లారు. ఈ సమయంలో గుండెపోటుతో అస్వస్థతకు గురి కాగా, తోటి కూలీలు వెంటనే సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.