News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News September 15, 2025
ధర్మవరం మహిళ హత్య కేసులో భర్త అరెస్ట్

ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సాకే సరస్వతి అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త వెంకటరాముడు హత్య చేశాడని టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఆయన వివరాల మేరకు.. రెండు నెలల క్రితం సరస్వతిని ఆమె భర్త వెంకటరాముడు బంధువులతో కలిసి హత్య చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్ల పల్లి వంక పక్కన శవాన్ని పూడ్చిపెట్టారు. తాజాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
News September 15, 2025
ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ

ITR ఫైలింగ్‌కు గడువు పొడిగించలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఐటీ విభాగం నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు.
News September 15, 2025
బాపట్ల ఎంపీకి 5వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!