News April 3, 2025
GWL: ఈత సరదా.. ముగ్గురి ప్రాణం తీసింది!

ఈతకెళ్లి మునిగిపోయి ముగ్గురు మృతిచెందిన ఘటన నిన్న రాజోళి మండలంలో జరిగింది. ఏపీలోని కర్నూలు లక్ష్మీనగర్‌కు చెందిన సులేమాన్(47) కుటుంబంతో కలిసి సుంకేసులడ్యామ్‌కు వచ్చారు. కొడుకులు ఫర్హాన్(11), ఫైజాన్(9)లతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు దిగారు. ప్రమాదవశాత్తు కొడుకులిద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన తండ్రి కాపాడేందుకు వెళ్లగా, ఆయనా మునిగిపోయారు. పోలీసుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News February 25, 2026
HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.
News February 25, 2026
తిరుపతిలో చిన్నారి మర్డర్.. వెలుగులోకి కొత్త విషయాలు

తిరుపతిలో ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌తో ఓ తల్లి తన కుమార్తెను <<19233769>>హత్య <<>>చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశాలత తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. భరణం కింద రూ.4 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. తర్వాత ఇన్‌స్టాగ్రాం ద్వారా రెడ్డి కుమార్ పరిచయం కావడంతో అతడితో సహజీవనం చేస్తోంది. వీళ్ల పెళ్లికి అడ్డుగా ఉందనే కారణంతోనే ఆశాలత కుమార్తెను చంపేసి పూడ్చి పెట్టారు.
News February 25, 2026
VKB: ఇద్దరు ప్రభుత్వ వైద్యుల తొలగింపు

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.


