News January 24, 2025

GWL: ఈనెల 26 నుంచి మరో 4 కొత్త పథకాలు..!

image

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి మరో నాలుగు కొత్త సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పూడూరులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించిందన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 24, 2025

BREAKING: ఖమ్మం: పిల్లాడి ప్రాణం తీసిన పెన్సిల్..!

image

ఆ పసివాడు రోజూలానే పెన్సిల్‌ను జేబులో పెట్టుకున్నాడు. కానీ అదే పెన్సిల్ తన ప్రాణాలను తీస్తుందని ఊహించలేకపోయాడు. ఖమ్మం పరిధి కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో యూకేజీ చదువుతున్న మేడారపు విహార్(6) బుధవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దురదృష్టవశాత్తు జేబులోని పెన్సిల్ బలంగా ఛాతిలోకి గుచ్చుకోవడంతో ఆ చిన్నారి విలవిలలాడుతూ చనిపోయాడు.

News December 24, 2025

ఆహ్లాదకర వాతావరణంలో క్రిస్మస్ జరుపుకోవాలి- SP

image

క్రైస్తవ సోదరులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శాంతియుత జీవనం వంటి విలువలు క్రీస్తు మానవాళికి అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను సంతోషంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News December 24, 2025

‘VB-G RAM G’పై ప్రభుత్వ అడుగు ఎటు?

image

TG: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం ‘VB-G RAM G’గా మార్చింది. దీనిని INC అధినేత్రి సోనియా, విపక్ష నేతలు వ్యతిరేకించారు. WB CM మమత తమ రాష్ట్ర ఉపాధి పథకానికి గాంధీ పేరు పెడతామని ప్రకటించారు. కర్ణాటక, కేరళ GOVTలు నిరసనకు దిగాయి. కేంద్ర చర్యను వ్యతిరేకించాలని రాష్ట్రంలోనూ డిమాండ్లున్నాయి. త్వరలో అసెంబ్లీ సమావేశాలున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ సాగుతోంది.