News November 5, 2025

GWL: ఈనెల 8న వేములవాడకు స్పెషల్ బస్సు-DM సునీత

image

కార్తీక మాసం సందర్భంగా గద్వాల జిల్లా భక్తుల సౌకర్యార్థం వైష్ణవ ఆలయాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని డీఎం సునీత బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. వేములవాడ దర్శిని పేరుతో వేములవాడ, కోటిలింగాలు, ధర్మపురి, కొండగట్టు, కొమరవెల్లి క్షేత్రాలు 2 రోజుల్లో దర్శించుకునేందుకు ఈనెల 8న తెల్లవారుజామున 4:00 సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందన్నారు. ఒకరికి రూ.2,350 ఛార్జీ ఉంటుందన్నారు. Contact 9959226290

Similar News

News November 5, 2025

రేణిగుంటలో ACBకి చిక్కిన క్యాష్ బ్యాగ్..?

image

రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఓ మహిళ క్యాష్ ఉన్న బ్యాగ్‌తో ఆఫీసులోకి వచ్చినట్లు సమాచారం. అధికారుల తనిఖీలను గుర్తించి ఆ బ్యాగ్‌ను పక్కన పడేశారంట. ఏసీబీ అధికారులు గమనించి “ఈ బ్యాగ్ ఎవరిది?” అని ప్రశ్నించగా ఎవరూ సమాధానం ఇవ్వలేదు. చివరికి ఆ బ్యాగ్‌‌ను అధికారులే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News November 5, 2025

CCRHలో 90 పోస్టులు

image

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<>CCRH<<>> )90 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగలవారు NOV 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), ఎంఫార్మసీ, MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in

News November 5, 2025

భార్యాభర్తల మధ్య అనుబంధాల కోసం..

image

కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ వ్రతంలో భాగంగా మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తర్లుగా ఉపయోగించి పూజించడం సంప్రదాయం. నేడు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల పూజాఫలం, పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని, ఇహపరలోకాలలో సుఖసౌఖ్యాలు, ముక్తి లభిస్తాయని పండితులు అంటున్నారు.