News March 6, 2025
GWL: ఒకవైపు తండ్రి మృతి.. మరోవైపు పరీక్ష

అయ్యో.. కాలం ఆ ఇంటర్ విద్యార్థికి ఎంతటి కఠిన పరీక్ష పెట్టిందో..! ఒకవైపు ఇంటర్ పరీక్షలు, మరోవైపు తండ్రి మృతదేహం. నాన్న దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థి వెళ్లిన ఘటన గద్వాల జిల్లా అల్లంపూర్ మండలంలోని లింగన్వాయిలో జరిగింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కుమారుడు సమీర్ దేవరకద్రలో గురుకులలో ఇంటర్ పరీక్ష రాసి అంత్యక్రియలో పాల్గొనడం అందరిని కంటతడి పెట్టించింది.
Similar News
News January 11, 2026
మీడియా సహాకారంతో వైకుంఠ ఏకాదశి సక్సెస్: కలెక్టర్

వైకుంఠ ఏకాదశి పదిరోజుల పాటు విజయవంతంగా నిర్వహించడంలో అన్ని విభాగాల సమన్వయం, ముఖ్యంగా మీడియా సహకారం కీలకమైందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సిబ్బందికి ప్రత్యేక అభినందన సమావేశంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. దర్శన వివరాలు భక్తులకు చేరవేయడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో, జేఈవో, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.
News January 11, 2026
ఖమ్మం: హరిదాసుగా ప్రభుత్వ టీచర్.. గంజాయిపై పోరు

హరిదాసు వేషధారణలో కనిపిస్తూ.. భక్తితో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. ఆదివారం కూసుమంచిలో వీధుల వెంబడి ఆయన తలపై అక్షయపాత్ర ధరించి, హరినామ సంకీర్తనలు చేస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు. గంజాయి,మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత వీటికి దూరంగా ఉండాలని కోరారు. సమాజ హితం కోసం ఉపాధ్యాయుడు ఇలా తిరుగుతూ అవగాహన కల్పించడం స్థానికంగా ఆకట్టుకుంది.
News January 11, 2026
NZB: అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని CP సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.


