News February 12, 2025
GWL: ఒక్కసారిగా కుప్పకూలి వ్యక్తి మృతి

ఒక్కసారిగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాలలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. చెనుగోనిపల్లికి చెందిన దౌలత్(44) ఓ వైన్స్‌లో మద్యం తీసుకుని అక్కడే తాగాడు. తాగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు లేపేందుకు ట్రై చేయగా.. లేవలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అతడు చనిపోయినట్లు నిర్ధారించి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటే కారణమని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News December 23, 2025
కస్టమర్ల మనసు గెలవడానికి ఇన్‌స్టామార్ట్ స్మార్ట్ స్టెప్!

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫిజికల్ స్టోర్స్ తెరుస్తోంది. నేరుగా వెళ్లి వస్తువులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ చూపించి కస్టమర్లలో నమ్మకం పెంచడానికి చేస్తున్న చిన్న ప్రయోగం ఇది. స్పీడ్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పడానికి గురుగ్రామ్(HR)లో ఈ ‘ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించింది. ఈ స్మార్ట్ స్టెప్ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా మరిన్ని సెంటర్స్ రానున్నాయి.
News December 23, 2025
వనపర్తి: ఈనెల 24న ఉమ్మడి శిబిరం.. పెండింగ్ ఖాతాదారులకు అవకాశం..!

పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన ఖాతాదారుల బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ షేర్ డబ్బులు తిరిగి పొందేందుకు రిజర్వు బ్యాంక్ మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. కలెక్టరేట్లోని IDOCలో ఈనెల 24న బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలతో ఉమ్మడి శిబిరం ఏర్పాటు చేశామని, జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News December 23, 2025
జవాన్ శేఖర్ ఇకలేరు.. శోకసంద్రంలో పెనుమంట్ర

పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ సమీపంలోని తీస్టా నదిలో సోమవారం శీతాకాలపు శిక్షణ నిర్వహిస్తున్న క్రమంలో ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న పెనుమంట్ర మండలం ఆలమూరుకి చెందిన జవాన్ శేఖర్ గల్లంతయ్యారు. సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తరువాత శేఖర్ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీంతో శేఖర్ సొంత గ్రామం ఆలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఆయన మృతదేహం స్వగ్రామానికి తరలించనున్నారు.


