News February 12, 2025
GWL: ఒక్కసారిగా కుప్పకూలి వ్యక్తి మృతి

ఒక్కసారిగా కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాలలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. చెనుగోనిపల్లికి చెందిన దౌలత్(44) ఓ వైన్స్‌లో మద్యం తీసుకుని అక్కడే తాగాడు. తాగిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు లేపేందుకు ట్రై చేయగా.. లేవలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అతడు చనిపోయినట్లు నిర్ధారించి.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుండెపోటే కారణమని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News December 25, 2025
ఐదు భాషల్లో ‘ధురంధర్-2’ విడుదల

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీకి పార్ట్-2 రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 19న రానున్న ‘ధురంధర్-2’ను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ పేర్కొంది. కాగా ధురంధర్ 20 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.640.20 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని తెలిపింది.
News December 25, 2025
ఫ్రెషర్లకు రూ.21 లక్షల జీతం.. ఇన్ఫోసిస్ డ్రైవ్!

దేశంలో మేజర్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల కోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.7-21 లక్షల వరకు ప్యాకేజీ ఉండే అవకాశం ఉందని మనీ కంట్రోల్ తెలిపింది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (లెవెల్ 1-3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ) పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, EEEలో BE, BTech, ME, MTech, MCA చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు వివరించింది.
News December 25, 2025
భువనగిరిలో విషాదం.. యువకుడి సూసైడ్

భువనగిరి పట్టణంలోని పెద్దచెరువు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పట్టణంలోని దోబివాడకు చెందిన శివగా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


