News September 13, 2025

GWL: కేటీఆర్ సభకు గద్వాల ఎమ్మెల్యే హాజరవుతారా?

image

గద్వాల నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు గద్వాలలో జరిగే కేటీఆర్ బహిరంగ సభకు ఆయన హాజరవుతారా లేదా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News September 13, 2025

సిటీకి రానున్న మీనాక్షి నటరాజన్.. వారం పాటు మకాం

image

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈనెల 16న హైదరాబాద్‌కు వస్తున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

News September 13, 2025

‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

image

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.

News September 13, 2025

IOBలో 127 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌(IOB)లో 127 స్పెషలిస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు అక్టోబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/బీఆర్క్‌/బీటెక్‌/బీఈ/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ/పీజీడీఎం/పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించాలి. 01-09-2025 నాటికి 25-40 ఏళ్లు ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://www.iob.in/<<>>