News September 5, 2025
GWL: చిన్నారులకు డాక్టర్ చేయూత..!

మల్లకల్ మండలం తాటికుంట రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన రాముడు, సంధ్య పిల్లలకు గద్వాల కు చెందిన డాక్టర్ హర్షవర్ధన్ మానవతా దృక్పథంతో రూ. 20 వేలు ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు చెక్కు అందజేశారు. వారి ఆరోగ్యం ఇతర అవసరాలకు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విండో చైర్మన్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 5, 2025
45 మంది రైతుల నుంచి కాల్స్ స్వీకరించిన కలెక్టర్

ఎన్టీఆర్ కలెక్టర్ డా.లక్ష్మీశా శుక్రవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా 45 మంది రైతులతో మాట్లాడారు. ఎరువుల సరఫరా, వినియోగంపై రైతుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. విడతల వారీగా యూరియా వినియోగం, అధిక దిగుబడులు, నేల సారానికి రక్షణ కలిగించే నానో యూరియా వినియోగంపై రైతులకు మార్గదర్శనం చేశారు. జిల్లాలో యూరియాకు ఎక్కడా కొరత లేదని వదంతులను నమ్మవద్దని కలెక్టర్ సూచించారు.
News September 5, 2025
రంప: ‘గురువు దైవంతో సమానం’

రంపచోడవరం మీటింగ్ హల్‌లో గురుపూజోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా PO. సింహాచలం మాట్లాడుతూ.. ప్రతీ మనిషి ఎదుగుదల వెనుక టీచర్ పాత్ర ప్రధానంగా ఉంటుందని అన్నారు. గురువు దైవంతో సమానం అన్నారు. డివిజన్ స్థాయిలో 22 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, అవార్డ్స్‌ను అందజేశారు. ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు, టీచర్స్, అధికారులు పాల్గొన్నారు.
News September 5, 2025
నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP

TG: HYD వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాది డీజే చప్పుళ్లతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సహకరిస్తోందన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఉ.6 గంటలకు ప్రారంభమై మ.1.30 గంటలలోపు పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 29వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.