News March 5, 2025

GWL: నీట్ యూజీ-2025 కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

image

జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో మే 4న నిర్వహించనున్న నీట్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గద్వాల్ పరిధిలోని ఎస్ఆర్. విద్యానికేతన్ (గద్వాల్), సరస్వతి స్కూల్ (ఎర్రవల్లి) పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. గదుల వసతులు సీటింగ్ ఏర్పాట్లు సీసీటీవీ పర్యవేక్షణ వెంటిలేషన్ తదిత అంశాలను పరిశీలించారు.

Similar News

News February 23, 2026

నరసరావుపేట: పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా గదులను పరిశీలించారు. పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తాగునీరు వంటి కనీస వసతుల్లో ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు.

News February 23, 2026

ఎత్తయిన ప్రదేశాల్లో తక్కువగా డయాబెటిస్ ముప్పు.. కారణమిదే

image

సముద్రమట్టం కంటే అధిక ఎత్తయిన ప్రదేశాల్లో నివసించే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్స్(US) సైంటిస్టులు కనుగొన్నారు. ‘ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు మెటబాలిక్ మోడ్‌లోకి మారి పెద్దమొత్తంలో గ్లూకోజ్‌ను గ్రహిస్తాయి. తక్కువ ఆక్సిజన్‌తోనే శరీరం మనుగడ సాధిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులూ తగ్గుతాయి’ అని పేర్కొన్నారు.

News February 23, 2026

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS ఆఫీసర్ అరెస్ట్

image

రఘరామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్‌కి చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి బీహార్ వెళ్లారు. గుంటూరు నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదు కాగా సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు.