News February 4, 2025

GWL: నేటి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

image

నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 12 వరకు జరగనున్నాయి. జమ్ములమ్మ మెట్టినిల్లు అయిన గుర్రం గడ్డ దీవి నుంచి ఎద్దుల బండి పై బుధవారం అమ్మవారి విగ్రహాన్ని జమ్మిచేడు ఆలయానికి తీసుకువస్తారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరి ఈ బ్రహ్మోత్సవాలకు మీరెళ్తున్నారా.?

Similar News

News March 2, 2026

NLG: ఇంటర్ పరీక్షల్లో ఇవాళ 441 మంది డుమ్మా!

image

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.

News March 2, 2026

వికసిత్ భారత్ లక్ష్యాలు ఇంటింటికీ చేరాలి: కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలు ప్రతి గడపకు చేరాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా చేపడుతున్న ‘వీబీజీ రాంజీ’ కార్యక్రమ గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో అధికారులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News March 2, 2026

కృష్ణా యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో MBA/MCA చదివే విద్యార్థులు(Y20- Y24 బ్యాచ్‌లు) రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి నిర్వహిస్తామని..విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 12లోపు, రూ.200 ఫైన్‌తో 16లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని KRU సూచించింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.